రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ కన్నడ పాఠశాలలను మూసివేసి కర్ణాటక పబ్లిక్ పాఠశాల(కేపీఎస్)లోకి విలీనం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయబోమని ఆదేశాలు జారీ చేయాలని ఏఐడీఎస్‌ఓ డిమాండ్ చేసింది. శనివారం లింగసూగూరు తాలూకా హట్టి ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థులతో చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు శరణప్ప మాట్లాడారు. విద్యను వ్యాపారీకరణ చేయరాదన్నారు. కేపీఎస్‌ల స్థాపనకు కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి నిధులను వాడుకోవడం సరికాదన్నారు.


