మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని సోమనహళ్లి–కేస్తూరు చౌరస్తాలోని అడిగాస్ హోటల్ సమీపంలో ప్రైవేట్ పాఠశాల బస్సు, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు, బస్సులో 6 మంది ప్రయాణికులతో కలిపి 20 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన 6 మందిని మెరుగైన చికిత్స కోసం మండ్య మిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల ముగించుకుని పిల్లలను తీసుకుని పల్లెకు వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చిన ప్రైవేటు బస్సు ఢీకొంది. తల్లిదండ్రులకు తెలిసి మద్దూరు ఆసుపత్రికి చేరుకుని తమ పిల్లల కోసం వెతుకులాడారు. మాజీ మంత్రి డి.సి. తమ్మన్న, కలెక్టరు కుమార్, ఎస్పీ శోభరాణి తదితరులు చేరుకుని వైద్య సేవలను పరిశీలించారు.
20 మందికి గాయాలు


