హొసపేటె: విజయనగర జిల్లా, హోస్పేట్ తాలూకా మరియమ్మనహళ్లి పట్టణంలో లక్ష్మీ నారాయణ స్వామి, ఆంజనేయ స్వామి రథోత్సవం శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని వీక్షించారు. రథం ముందుకు కదులుతుండగా భక్తులు జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేశారు. కదులుతున్న రథంపై అరటి పండ్లు, పూలు, అగరబత్తులను విసురుతూ భక్తిని చాటుకున్నారు. గత నాలుగైదు రోజులుగా వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి పర్యవేక్షణలో డీఎస్పీ మల్లేష్ దొడమణి, సీపీఐ వికాస్ లమాని, పీఎస్‌ఐ తారాబాయి నేతృత్వంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.


