రాయచూరు రూరల్: లింగసూగురు తాలుకాలో కళ్యాణ పథకంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం లింగసూగురు ఏసీ కార్యాలయం వద్ద ఆ సంఘం అధ్యక్షుడు వీరభద్రప్ప విలేకరులతో మాట్లాడారు. కళ్యాణ పథకం, ప్రధానమంత్రి సడక్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రహదారి పనులు నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. నీల్గల్ నుంచి చిక్కహెసరూర్ వరకు 6.7 కి.మీ రహదారి పనులకు రూ.4.34 కోట్ల వ్యయం చేశారని ఆరోపించారు. కాంట్రాక్ట్ పొందిన శాసన సభ్యుడు వజ్జల్ మానప్ప సోదరులు వడ్డెర కంపెనీ నాసిరకంగా పనులు చేపట్టారని తెలిపారు. అలాంటి రహదారి నిర్మాణాలు చేపట్టిన వారిని బ్లాక్ లిస్ట్‌లో చేర్చి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.


