ఇకపై టెన్త్‌ మార్కులు 525 మాత్రమే | - | Sakshi
Sakshi News home page

ఇకపై టెన్త్‌ మార్కులు 525 మాత్రమే

Mar 28 2026 7:26 AM | Updated on Mar 28 2026 7:26 AM

శివాజీనగర: రాష్ట్రంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ విద్యార్థులపై విద్యా ఒత్తిడిని తగ్గించే దిశలో పాఠశాల విద్యా, సాక్షరత మంత్రి ఎస్‌.మధు బంగారప్ప శుక్రవారం అతి ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు. ఇకపై ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల్లో తృతీయ భాషకు గ్రేడింగ్‌ పద్ధతి అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 625 మార్కుల్లో తృతీయ భాషకు 100 మార్కులను నిర్ణయించారు. ఇకపై తృతీయ భాషలో పాస్‌ గాని ఫెయిల్‌ అనే పద్ధతి ఉండదు. అంటే ఫైనల్‌ ఫలితాల మార్కులకు తృతీయ భాష మార్కులను పరిగణించబోరు. అలా కాకుండా గ్రేడింగ్‌ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. హిందీ, సంస్కృతం, తుళు, మరాఠి, అరబిక్‌తో పాటు పాఠ్యక్రమంలో ఉన్న అన్ని తృతీయ భాషలకూ ఈ నియమం అన్వయిస్తారన్నారు. అధికారిక ఆదేశాలను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.

పిల్లలకు నైతిక విద్య :

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా నైతిక విద్య పుస్తకాలను అందిస్తామన్నారు.

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం

విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని 16 సంవత్సరాలలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నిషేధిస్తూ అతి ముఖ్యమైన ప్రతిపాదనను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించామన్నారు. అందరి నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సమస్య కేవలం ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం కాదు. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్‌ వినియోగం అరికట్టే విషయంపై ఎక్కువ బాధ్యత వహించాలని మంత్రి పేర్కొన్నారు.

గతంలో మాదిరిగా మొత్తం 625 కాదు

హిందీ పరీక్ష మార్కులు లెక్కలోకి రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement