మెత్తబడిన సాదిక్‌ ఫైల్వాన్‌ | - | Sakshi
Sakshi News home page

మెత్తబడిన సాదిక్‌ ఫైల్వాన్‌

Mar 28 2026 7:26 AM | Updated on Mar 28 2026 7:26 AM

శివాజీనగర/సాక్షి, బళ్లారి : దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరుగుబాటుకు ట్విస్ట్‌ లభించింది. ఎస్‌ఎస్‌ మల్లికార్జున కుమారుడు సమర్థకు టికెట్‌ ఇచ్చినందుకు తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగిన సాదిక్‌ పైల్వాన్‌ ఎట్టకేలకు మెత్తబడ్డారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు. శుక్రవారం సీఎం ప్రభుత్వ నివాస కార్యాలయానికి ఆయనను పార్టీ నాయకులు రిజ్వాన్‌ అర్షద్‌, సలీం అహమ్మద్‌ ఖాన్‌ పిలుచుకొచ్చారు. సాదిక్‌ పైల్వాన్‌తో సీఎం కొంతసేపు చర్చించారు. ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించుకొందామని, అండగా ఉంటామని సాదిక్‌కు భరోసా ఇచ్చారని తెలిసింది. కాంగ్రెస్‌ ఉన్నత వర్గాల కథనం ప్రకారం సీఎం సిద్దరామయ్యతో సాదిక్‌ పైల్వాన్‌ చర్చలు ఫలించాయి. దీంతో సాదిక్‌ తాను పోటీ నుంచి తప్పుకుని, కాంగ్రెస్‌ అభ్యర్థి సమర్థ్‌కు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారని విధాన పరిషత్‌ ప్రభుత్వ చీఫ్‌విప్‌ సలీం అహమ్మద్‌ సమాచారం అందించారు.

దావణగెరె దక్షిణ కాంగ్రెస్‌

తిరుగుబాటులో ట్విస్ట్‌

సీఎం సిద్దరామయ్యను కలిసిన

రెబల్‌ అభ్యర్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement