1న తుమకూరుకు రాష్ట్రపతి ముర్ము రాక | - | Sakshi
Sakshi News home page

1న తుమకూరుకు రాష్ట్రపతి ముర్ము రాక

Mar 28 2026 7:26 AM | Updated on Mar 28 2026 7:26 AM

తుమకూరు: ఏప్రిల్‌ 1న సిద్ధగంగ మఠంలో లింగైక్య శ్రీశివకుమార స్వామీజీ జయంతి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఆ రోజు తుమకూరు నగరం అంతటా పోలీసు భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. శుక్రవారం జిల్లా కమిషనర్‌ కార్యాలయంలో ప్రముఖుల భద్రతపై జరిగిన ప్రాథమిక సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లాధికారిణి శుభా కళ్యాణ్‌ మాట్లాడుతూ రాష్ట్రపతి కార్యక్రమానికి, ప్రముఖులకు ప్రస్తుతం ఉన్న భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే బాధ్యతను జిల్లా స్థాయి అధికారులకు ఆమె అప్పగించారు. దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి రాకను దృష్టిలో ఉంచుకుని నగరం అంతటా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ కేవీ అశోక్‌ తెలిపారు.

రాష్ట్రపతి భద్రత కోసం సుమారు 15 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో పాల్గొన్న సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి చెందిన సుహాస్‌ సూడ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనలో భద్రత అత్యంత కీలకం. జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర నిఘా శాఖ ఎస్పీ సురేష్‌, అదనపు కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.తిప్పేస్వామి, సిద్ధగంగ మఠం ప్రతినిధి మల్లికార్జున్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రతినిధుల బందం తుమకూరు వర్సిటీ హెలిప్యాడ్‌, సిద్ధగంగ మఠంలో కార్యక్రమం జరిగే వేదికలను పరిశీలించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement