తుంగభద్రలో మునిగి నలుగురు మృతి | - | Sakshi
Sakshi News home page

తుంగభద్రలో మునిగి నలుగురు మృతి

Mar 28 2026 7:26 AM | Updated on Mar 28 2026 7:26 AM

రాయచూరు రూరల్‌: జిల్లాకు చెందిన నలుగురు తుంగభద్ర నదిలో మునిగి దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మాన్వి తాలూకా కుర్డి గ్రామానికి చెందిన 18 మంది కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో ఓ వివాహానికి వెళ్లారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కుందకూరు వద్ద తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు జల సమాధి అయ్యారు. మాన్వి తాలూకా కుర్డికి చెందిన దాసరి ఉమాపతి(28), దాసరి రత్నమ్మ (26), దాసరి శివానంద(20), దాసరి మహేష్‌(20) నదిలో సరదాగా స్నానానికి వెళ్లి లోతట్టు ప్రాంతంలోకి దిగి పోవడంతో అక్కడికక్కడే మరణించారు. ఆ ప్రాంతంలో తెప్ప సహాయంతో గాలించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement