శ్రీరామ నవమికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

శ్రీరామ నవమికి సర్వం సిద్ధం

Mar 27 2026 9:23 AM | Updated on Mar 27 2026 9:23 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. భక్తులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోనున్నారు. రాయచూరు గ్రామీణ నియోజకవర్గంలోని పంచముఖ గాణదాళ ఆంజనేయ స్వామి ప్రాణ దేవర ఆలయం, నగరంలోని రామ మందిరం, పాతాళ ఆంజనేయ, కోటలో వెలసిన రామాలయంలో ప్రత్యేక పూజలు నెరవేరనున్నాయి.

తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు

రాయచూరు రూరల్‌: జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రానీయ వద్దని, దాని నియంత్రణకు అధికారులు జాగ్రత్తలు పాటించాలని రాయచూరు జిల్లాధికారి నితీష్‌ అధికారులకు సూచనలు జారీ చేశారు. జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమైందని, నాలుగు నెలల పాటు ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడకుండ చూడాలని ఆదేశించారు. నీటి సౌకర్యాలు లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు యజమానులతో చర్చించాలన్నారు. ఎక్కడా కూడా ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడరాదన్నారు. అన్ని చెరువులను నీటితో నింపాలని సూచించారు.

విశ్వకర్మలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అఖిల కర్ణాటక విశ్వకర్మ మహా సభ సమాజం డిమాండ్‌ చేసింది. బుధవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు మారుతి మాట్లాడారు. కుల శాస్త్ర అధ్యయనం చేపట్టాలని, తింథిణి మౌనేశ్వర ప్రాధికార ఏర్పాటుపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి పంపదలచిన వినతిపత్రాన్ని జిల్లాధికారికి సమర్పించారు.

గర్భకోశ క్యాన్సర్‌ను నివారిద్దాం

రాయచూరు రూరల్‌: మహిళల్లో గర్భకోశ క్యాన్సర్‌ వ్యాధి నివారణకు 16 ఏళ్ల లోపు బాలికలకు టీకాలు వేయించడంతో పాటు వ్యాధి నియంత్రణకు ముందురండాలని రాయచూరు తహసీల్దార్‌ సురేష్‌వర్మ సూచించారు. జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. అధిక శాతం మహిళల్లో గర్భకోశ క్యాన్సర్‌ వ్యాధి కనపడుతోందన్నారు. స్తన క్యాన్సర్‌ను గుర్తించినట్లు, గర్భకోశ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టమని తెలిపారు. తాలూకా ఆరోగ్య వైద్యాధికారులు అమృత, ప్రజ్వల్‌, అనూషా, ఈఽశ్వర్‌, గుండమ్మ, నాగరాజ్‌, సరోజ, సురేష్‌, ఈరమ్మ, రామకృష్ణ, సునీల్‌, అష్పక్‌, పరాన్‌ నస్రీన్‌ ఖాజీలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement