అమర అభిమానులకు గౌరవం | - | Sakshi
Sakshi News home page

అమర అభిమానులకు గౌరవం

Mar 26 2026 7:33 AM | Updated on Mar 26 2026 7:33 AM

చిన్నస్వామిలో శిలాఫలకం

బనశంకరి: గత ఏడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) విజయోత్సవాలలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ముందు తొక్కిసలాట జరిగి 11 మంది పౌరులు మరణించడం తెలిసిందే. ఐపీఎల్‌ కొత్త సీజన్‌ టోర్నీ మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. చిన్నస్వామి మైదానంలో 28న మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో తొక్కిసలాట మృతుల గౌరవార్థం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే మృత్యుంజయ, గణపతి, లక్ష్మీహోమాలు నిర్వహించారు. హోంమంత్రి పరమేశ్వర్‌, కర్ణాటక క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌ప్రసాద్‌ తదితరులు శిలఫలకానికి నివాళులు అర్పించారు. మళ్లీ అరిష్టాలు జరగకూడదని స్టేడియం గేట్లకు బూడిద గుమ్మడికాయతో దిష్టితీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement