● గవర్నర్ గెహ్లాట్
మైసూరు: భారతదేశ మహా నాగరికత, సంస్కృతి ప్రపంచస్థాయిలో ఎంతో ఖ్యాతి గడించిందని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. బుధవారం మైసూరు ముక్త గంగోత్రిలోని కర్ణాటక సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ‘ఏకాత్మ మానవ దర్శనం: భారతదేశం విశ్వదృష్టి’ అనే సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ కాలానుగుణంగా ఎంతోమంది మహానుభావులు దేశంలో జన్మించి దేశం వారసత్వం, సంస్కృతిని ప్రపంచ వేదికలపై చాటిచెప్పారని తెలిపారు. దీనదయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనం దేశ ఆత్మ, సంస్కృతి, ఆలోచన, జీవిత శైలికి మూలాధారంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో సుత్తూరు పీఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర మహాస్వామి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణ, పలువురు స్వామీజీలు పాల్గొన్నారు.
చాముండేశ్వరి దేవి దర్శనం
నాడశక్తి దేవత చాముండేశ్వరీ అమ్మవారిని గవర్నర్ దర్శించుకున్నారు. చాముండిబెట్ట మీద అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాధికార ప్రతినిధులు గవర్నర్‌ను సన్మానించారు.


