మార్ట్‌ వద్ద ట్రాఫిక్‌ రద్దీతో విలవిల | - | Sakshi
Sakshi News home page

మార్ట్‌ వద్ద ట్రాఫిక్‌ రద్దీతో విలవిల

Mar 26 2026 7:33 AM | Updated on Mar 26 2026 7:33 AM

హొసపేటె: ఎంపీ ప్రకాష్‌ నగర్‌ రోడ్డులోని రిలయన్స్‌ మార్ట్‌ ముందు ప్రజలు తమ వాహనాలను అస్తవ్యస్తంగా పార్క్‌ చేస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన ఈ ప్రాంతంలో ప్రతి రోజు వందలాది మంది వినియోగదారులు రిలయన్స్‌ మార్ట్‌ను సందర్శిస్తుంటారు. అయితే వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాలను రోడ్డు పైనే ఇష్టానుసారంగా పార్క్‌ చేస్తున్నారు. రోడ్డుపై వాహనాలను పార్క్‌ చేయడం వల్ల ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా మారింది. వాహనాల కారణంగా రోడ్డులో సగం భాగం పార్కింగ్‌ స్థలంగా మారిపోయింది. దీని కారణంగా పాదచారులు నడవడానికి స్థలం లేకుండా పోతోంది. ఫలితంగా వాహనదారులు, ముఖ్యంగా రాత్రి పూట ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. సరైన లైటింగ్‌ వ్యవస్థ ఉన్నా రోడ్డు మధ్యలో వాహనాలను నిలపడం వల్ల చిన్నచిన్న ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని స్థానికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement