రాయచూరు రూరల్: పదో తరగతి పరీక్షలకు గైర్హాజరైన ఓ విద్యార్థిని పొలం పనిలో నిమగ్నమైన ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. గదగ్ జిల్లా ముండరిగి తాలూకా పేటాలూరుకు చెందిన విద్యార్థిని తల్లిదండ్రులు పేదవారు కావడంతో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఆ కుటుంబం నెట్టుకొస్తోంది. ఈ తరుణంలో హైస్కూలు విద్యార్థిని పల్లవి హళ్లికేర ముండరిగి పరీక్ష కేంద్రంలో పరీక్షను రాయకుండా గైర్హాజరై తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటానంటూ పొలం పనికి వెళ్లింది. గమనించిన విద్యా శాఖాధికారి గంగాధర్ వెంటనే ద్రాక్ష తోటలో పనికి వెళ్లిన పల్లవిని ద్విచక్రవాహనంలో పరీక్ష కేంద్రం వద్దకు తీసుకొచ్చి పరీక్షకు పంపారు.
అధికారుల చొరవతో ఎట్టకేలకు
పరీక్షలకు విద్యార్థిని హాజరు


