బళ్లారిటౌన్: భారతీయ సంస్కృతిలో ఆది నుంచి మహిళలకు ప్రత్యేక స్థానం లభిస్తుందని డాక్టర్ జగ్జీవన్ రాం చర్మ పారిశ్రామిక అభివృద్ధి మండలి అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజ్ పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి భవనంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర పూర్వంలో పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మహిళలు తమిళనాడు రాణి అబ్బక, కిత్తూరు రాణి చెన్నమ్మ, ఝాన్సీలక్ష్మీబాయి లాంటి ఎంతో మహిళలు ఉన్నారని గుర్తు చేశారు. డాక్టర్ అంబేడ్కర్ మహిళలకు సమాన హక్కులను కల్పించి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి బిల్లులు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న అనేక సదుపాయాలను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమేరా, పాలికె మేయర్ పీ.గాదెప్ప, జిల్లా గ్యారెంటీ పథకాల అమలు అధ్యక్షుడు చిదానందప్ప, ఏడీసీ మహమ్మద్ ఝుబేర తదితరులు పాల్గొన్నారు.


