రాయచూరు రూరల్: నగరంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించాలని మైసూరు సిటీ కార్పొరేషన్ ఇంజినీర్ నవీన్ కుమార్ సూచించారు. మంగళవారం నగరంలోని సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మైసూరు సిటీ కార్పొరేషన్ స్వచ్ఛతలో దేశ స్థాయిలో ప్రథమ స్థానం అలంకరించిందన్నారు. ఈ విషయంలో మైసూరు సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయచూరు సిటీ కార్పొరేషన్‌తో ఒప్పందాలు కుదుర్చుకొందన్నారు. అధికారులు మహదేవమ్మ, జ్యోతి, యోగేష్, అశ్వఽథ్, శివ ప్రసాద్, నగరసభ అధికారులు భరత్ కుమార్, సంతోష్ రాణి, మల్లికార్జున రెడ్డిలున్నారు.


