సమస్యల పరిష్కారానికి చర్యలు
రాయచూరు రూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న జెస్కాం ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కర్ణాటక విద్యుత్ మండలి ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బసవణ్ణ హమీ ఇచ్చారు. శుక్రవారం జెస్కాం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పింఛన్ పథకం, కేపీసీ ప్రకారం పనిభారం తగ్గింపు, గ్రూప్–సీ, గ్రూప్–డీ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నగదు రహిత ఆరోగ్య భాగ్య కార్డుల ద్వారా జెస్కాం ఉద్యోగులకు వైద్యం అందించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ దేశాయి, గోపి తదితరులు పాల్గొన్నారు.
ఆశా కార్యకర్తలను
పర్మినెంట్ చేయాలి
రాయచూరు రూరల్: ఆశా కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ఆశా కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం టిప్పు సుల్తాన్ ఉద్యానవనంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు వీరేష్ మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర సర్కార్లు ముందుకు రావాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచాలని కోరారు. ఆశా కార్యకర్తలను ఆదుకోవాలని సూచించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
జిలెటిన్ వస్తువుల స్వాధీనం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా హట్టి బంగారు గనుల కంపెనీ ముందు భాగంలో 15కి పైగా జిలెటిన్ వస్తువులను కంపెనీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ప్రధాన ద్వారం వద్ద జిలెటిన్ వస్తువులు కనిపించాయి. అధికారుల అనుమతి లేనిదే జిలెటిన్ వస్తువులను బహిరంగ ప్రాంతాల్లోకి తీసుకొచ్చేందుకు అవకాశాలు లేవు. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో బయటికి వచ్చాయా? అనే కోణంలో విచారణ చేపట్టినట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ వివరించారు.
సీహెచ్ పౌడర్
విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
రాయచూరు రూరల్: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సీహెచ్ పౌడర్ విక్రయించిన కేసులో మహిళను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శుగిరి వెల్లడించారు. శుక్రవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గురువారం సాయంత్రం నగరంలోని గద్వాల రహదారి వీరాంజనేయ దేవాలయం వద్ద ఉరుకుందమ్మ అనే మహిళను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఆమె నుంచి 153 లీటర్ల కల్తీ కల్లు, 203 ప్యాకెట్ల సీహెచ్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
దళితులు ముఖ్యమంత్రి కావడం అసాధ్యం
రాయచూరు రూరల్: ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకె.శివకుమార్ గొడవల మధ్య రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నలిగిపోతోందని విజయపుర శాసన సభ్యుడు బసనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు. గురువారం రాత్రి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రె్‌స్ పార్టీలో దళితులు ముఖ్యమంత్రి కావడం అసాధ్యమన్నారు. సిద్దరామయ్య పదవిని వదలరు.. శివ కుమార్ అడగరు.. సీఎంను మార్చే ప్రశ్న తలెత్తదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2.80 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా.. వాటిని భర్తీ చేయడం కాంగ్రెస్‌కు చేత కావడం లేదని ఎద్దేవా చేశారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
సమస్యల పరిష్కారానికి చర్యలు
సమస్యల పరిష్కారానికి చర్యలు


