కాంగ్రెస్ మైనార్టీ సెల్‌కు నియామకం
రాయచూరు రూరల్: కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడిగా మహ్మద్ సోహైల్ నాయక్, కార్యదర్శిగా మహబూబ్‌లను నియమిస్తూ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఫయాజుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పరాజిత అభ్యర్ధి శాలం ఆధ్వర్యంలో నియమాలను పాటించి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాధ్యక్షుడు సయ్యద్ ఫయాజుద్దీన్, యూసఫ్ ఖాన్, నరసింహులు, శౌకత్ హమ్రాజ్‌లున్నారు.
మహిళలపై నేరాల కట్టడికి అక్క పడె
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో అక్క పడె ద్వారా మహిళలపై నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. మంగళవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయం వద్ద అక్క పడె వాహనాన్ని ఎస్పీ పుట్టమాదయ్య ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పిల్లల రక్షణతో పాటు అక్క పడె మహిళల నేరాల నియంత్రణకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా విజయపురలో ప్రారంభించగా, రెండవ అక్క పడెను పోలీస్ యంత్రాంగం రూపొందించిందన్నారు. మహిళల సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు 10 మంది మహిళా పోలీసులను నియమించామన్నారు. అదనపు ఎస్పీలు హరీష్, కుమారస్వామి, డీఎస్పీ శాంతవీర, ఇతర పోలీస్ అధికారులున్నారు.
మహబూబ్
సోహైల్ నాయక్
కాంగ్రెస్ మైనార్టీ సెల్‌కు నియామకం
కాంగ్రెస్ మైనార్టీ సెల్‌కు నియామకం


