రెండుచోట్ల బస్సు ప్రమాదాలు
యశవంతపుర: కారు, ప్రైవేట్ బస్సు, కారు, స్కూటర్ మధ్య జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన హాసన్ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా హిరిసావె వద్ద హైవే– 75 లో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుడు ఎంసీ దేవరాజ్ (54) స్కూటర్‌లో వెళ్తూ ఉండగా, హాసన్ నుంచి బెంగళూరుకు వస్తున్న ప్రైవేట్ బస్సు వేగంలో అదుపుతప్పి కారును ఢీకొంది. తరువాత సర్వీసు రోడ్డులోకి దూరి స్కూటర్‌ను గుద్ది పల్టీ పడింది. బస్సులోనివారు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. స్కూటరిస్టు దేవరాజ్ చనిపోయాడు. కారు నుజ్జుయింది. ఈ ప్రమాదంతో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయ్యాయి.
బస్సు పల్టీ, 29 మందికి గాయాలు
బాగల్‌కోట జిల్లా బాదామి తాలూకా నుంచి ధర్మస్థళకు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సు వేగంలో అదుపుతప్పి పల్టీ పడింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర తాలూకా సోలెమర్కి గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బాదామి నుంచి బస్సు ధర్మస్థళకు వెళ్తోంది.
స్కూటరిస్టు మృతి, ప్రయాణికులకు గాయాలు


