మహా నందీశ్వర మస్తకాభిషేకం
మైసూరు: మైసూరు నగరంలోని చాముండికొండపైన వెలసిన ఐదువందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకశిలా మహా నందీశ్వరునికి కార్తీక మాసం సోమవారం సందర్భంగా సోమవారం మహాభి షేకం గావించారు. చాముండికొండ గ్రామస్తులు, మైసూరుకు చెందిన వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. బెట్టద బలగ ఆధ్వర్యంలో ఉదయం 10:01 గంటలకు సుత్తూరు సోమనాథానంద స్వామి, చిదానంద స్వామీజీలు పాల్గొని మహాభిషేకాన్ని ప్రారంభించారు. నందీశ్వరునికి ప్రత్యేక వేదిక పై నుంచి 43 రకాల ద్రవ్యాలతో కనులపండువగా అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, కొబ్బరినీరు, చెరుకు రసం, నువ్వుల నూనె, పాయసం, ఇలా అనేక ద్రవ్యాలు, నైవేద్యాలతో మహా మస్తకాభిషేకం మాదిరిగా సాగింది.
చాముండి బెట్టపై నేత్రపర్వం


