దయజూపవా.. భోళా శంకరా!
బొమ్మనహళ్లి: శివశివ శంకర.. భక్తవ శంకర.. శంభోహరహర నమోనమః.. అని భక్తులు తన్మయత్వంలో భోళా శంకరున్ని కీర్తిస్తూ పూజించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సోమవారం బెంగళూరు నగరంలో పరమశివుని ఆలయాలలో విశేష పూజలు, దీపారాధనలు జరిగాయి. భక్తులు వెల్లువలా తరలివచ్చి త్రినేత్రున్ని దర్శించుకుని పునీతులయ్యారు.
బొమ్మనహళ్లిలో..
బొమ్మనహళ్ళి హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో శ్రీ బసవేశ్వర స్వామి, గాయత్రీ దేవాలయంలో కార్తీకం చివరి సోమవారం కావడంతో శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. భక్తులు స్వామివారికి 365 ఒత్తులు దీపాలు వెలిగించి పూజించారు.
ఓంకార ఆశ్రమంలో
బనశంకరి: బెంగళూరు ఉత్తరహళ్లి–కెంగేరి రహదారిలోని శ్రీనివాసపురలో ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం (ఓంకార ఆశ్రమం)లో జ్యోతిర్లింగాలకు అర్చకులు గంధంతో అలంకరించారు. పీఠాధిపతి మధుసూదనానందపురి స్వామి జ్యోతిర్లింగాలకు పూజలు, మహామంగళహరతి చేపట్టారు. భక్తులు జ్యోతిర్లింగాలను దర్శించుకుని దీపారాధన చేశారు.
శివబాలయోగి ఆశ్రమంలో
బనశంకరి: బెంగళూరు జేపీ నగరలోని శివబాలయోగి మహారాజ్ ఆశ్రమం కార్తీకశోభ సంతరించుకుంది. శివాలయంలో మరకత ఉదయం 7 గంటలకు అర్చకులు పంచామృత రుద్రాభిషేకం గావించారు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.
బనశంకరి ఆలయంలో పర్వత
మల్లికార్జునుని సన్నిధిలో..
శివబాలయోగి మఠంలో మరకత శివలింగం
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో చందన అలంకారం
విశేషంగా కార్తీక సోమవారం పూజలు
ముక్కంటి ఆలయాలలో భక్త సాగరం
దయజూపవా.. భోళా శంకరా!
దయజూపవా.. భోళా శంకరా!
దయజూపవా.. భోళా శంకరా!
దయజూపవా.. భోళా శంకరా!
దయజూపవా.. భోళా శంకరా!


