రచయితకు సన్మానం
బళ్లారి అర్బన్: దళితులు, పేదలు ఎక్కువగా గ్రామాల్లోని తూర్పు ఈశాన్య దిక్కులో ఉంటారు, అయితే తోరణగల్లులో మాత్రం దళితుల వీధి గ్రామం నడిబొడ్డున ఉందని, ఈ ఆధారంగా దళితులు తోరణగల్లు గ్రామ మూల నివాసులు అనే విషయాన్ని తాను మా తోరణగల్లు ఓ చారిత్రక అధ్యయనం పేరుతో పరిశోధన గ్రంథం ద్వారా కనుగొన్నానని రచయిత, ప్రచురణకర్త అబ్దుల్ హై తోరణగల్లు తెలిపారు. స్నేహ సంపుట మీటింగ్ అన్నపూర్ణ ప్రింటర్స్ ఆధ్వర్యంలో అబ్దుల్‌ను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ సాహితీవేత్త ఎల్లప్పుడు తన అంతరంగాన్ని తెరిచి ఉంచాలన్న పేదల మాట మేరకు తన అంతః కన్నుతో కనుగొన్నానన్నారు. దళిత ఆడ పిల్లలను శ్రీమంత వర్గాలు కొన్ని మూఢాచారాలకు బలి చేశారని దేవదాసి పద్ధతి, దానికి నిదర్శనం అన్నారు. తోరణగల్లు చరిత్ర పూర్వాపరాల గురించి ఆయన చక్కగా వివరించారు. పలు అవార్డులు కూడా తీసుకున్నానని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నపూర్ణ ప్రింటర్స్ సిరిగేరి ఎర్రిస్వామి మాట్లాడుతూ రచయిత ఎన్ని గ్రంథాలు రచించడం కన్నా వాటిలో ఎన్ని సామాజిక అంశాలు ప్రతిబింబించారన్నదే కీలకం అన్నారు. ప్రముఖులు కల్లుకంబ, టీచర్ ఈరమ్మ, టీఎన్.వెంకమ్మ, నాగరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


