నేత్ర వైద్యంపై చర్చావేదిక
హుబ్లీ: నేత్ర ఆరోగ్యం, పరిరక్షణలో పట్టభద్రుల పాత్ర అంశంపై సోమవారం స్థానిక ఐఎంఏ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చర్చావేదిక నిర్వహిస్తున్నట్లు జయప్రియ కంటి వైద్యులు తెలిపారు. ముఖ్య వైద్యులు డాక్టర్.వెంకటరామకట్టి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో బెంగళూరు, ఢిల్లీ, తదితర రాష్ట్రాల నుంచి ఉపన్యాసకులు వచ్చి కంటి వైద్యంలో తమ అనుభవాలను వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. ముఖ్య అతిథులుగా మేయర్ జోతిపాటిల్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్.బసవరాజ సర్జన్, సీఏ చరంతిమఠ డాక్టర్లు పాల్గొననున్నారు.
ఇద్దరు పోలీసుల మృతి
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో గుండె పోటుతో ఓ ఏఎస్‌ఐ, అనారోగ్యంతో మరో హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందారు. కలఘటికి స్టేషన్ ఏఎస్‌ఐ చంద్రకాంత ఉటగి విశ్రాంతి తీసుకుంటుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ధహెడ్ కానిస్టేబుల్ ఎంబీ.భజంత్రి అవయవాల వైఫల్యంతో మృతిచెందినట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.


