సొంత ఖర్చులతో అసెంబ్లీకి వస్తా
రాయచూరు రూరల్ : ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వినిపించి వాటి పరిష్కారం కోసం డిసెంబర్‌లో బెళగావిలో జరగనున్న శీతాకాల సమావేశాలకు సొంత ఖర్చులతో అసెంబ్లీకి వస్తామని జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కందకూరు అసెంబ్లీ స్పీకర్ యూ.టీ.ఖాదర్‌కు లేఖ రాసిన విషయం వెలుగులోకి వచ్చింది. కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి జిల్లా గురుమిఠకల్ క్షేత్రం శాసన సభ్యుడు స్పీకర్‌కు లేఖ రాశారు. ప్రజల నుంచి ఎన్నికై న ప్రజా ప్రతినిధి ప్రజల సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి వస్తామని, ఎలాంటి సౌకర్యాలు పొందకుండా ఎలాంటి సర్కారీ భత్యాలు తీసుకోకుండా స్వంతంగా ఖర్చులు పెట్టుకొని వస్తామని ఆ లేఖలో వివరించారు. అసెంబ్లీలో ఏ సమస్యలపై ప్రస్తావించినా పనులు కావడం లేదని, తమను ఎన్నుకున్న ప్రజలు నిలదీస్తున్నారని ప్రస్తావించారు. కళ్యాణ కర్ణాటకలో వరదలు సంభవించినా సర్కార్ స్పందించక పోవడంపై విచారం వ్యక్తం చేశారు.
బెళగావి శీతాకాల సమావేశాలు
అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసిన ఎమ్మెల్యే
గురుమిఠకల్ జేడీఎస్ శాసన సభ్యుడు శరణగౌడ కందకూరు


