మందేసి.. స్టీరింగ్‌ ముందుకు.. | - | Sakshi
Sakshi News home page

మందేసి.. స్టీరింగ్‌ ముందుకు..

Nov 12 2025 6:53 AM | Updated on Nov 12 2025 6:53 AM

మందేస

మందేసి.. స్టీరింగ్‌ ముందుకు..

సాక్షి, బెంగళూరు: బీఎంటీసీ విద్యుత్‌ చాలిత (ఈవీ) బస్సులు మార్గమధ్యలో పాడైపోతూ అర్ధాంతరంగా నిలిచిపోయే ఉదాహరణలు బెంగళూరులో కోకొల్లలు. వాటితో పాటు ఇటీవల కాలంలో ఈవీ బస్సుల డ్రైవర్లపై ఒక పెద్ద ఆరోపణ తరచూ వినిపిస్తోంది. విధి నిర్వహణలో క్రమశిక్షణ లేదని ఆ డ్రైవర్లపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలా రెండున్నరేళ్లలో మద్యం సేవించి వాహనం నడపడం, విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వంటి కారణాలపై 627 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈవీ బస్సుల్లో భద్రతపై ప్రస్తుతం ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

డిపోలలో తనిఖీలు ఏమయ్యాయి?

నగరవ్యాప్తంగా ఉన్న వివిధ బీఎంటీసీ డిపోల్లో మద్యం తాగారా అనే పరీక్షలు చేస్తారు. రోజూ ఉదయం , మధ్యాహ్నం షిప్టుల్లో పని చేసేందుకు వచ్చే డ్రైవర్లకు బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షిస్తారు. మద్యం తాగి పట్టుబడితే అలాంటి డ్రైవర్లను విధులకు పంపించకుండా అడ్డుకుంటారు. కానీ చాలామంది డ్రైవర్లు మద్యం సేవించి స్టీరింగ్‌ పడుతున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎక్కువగా ఈవీ బస్సుల డ్రైవర్లు ఉండడం గమనార్హం. విధి నిర్వహణ సమయంలో మద్యం సేవించినట్లు రుజువు అయితే ప్రతిసారి రూ. 3 వేలు జరిమానా విధిస్తారు. కానీ పట్టుబడిన కేసులు ఎక్కడా నమోదు కావడం లేదు.

1,644 బ్యాటరీ బస్సులు..

బీఎంటీసీ 2021 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,644 ఎలక్ట్రిక్‌ బస్సులను పరిచయం చేసింది. సంస్థలో 5,423 డీజిల్‌ ఇంధనంతో నడిచే బస్సులు ఉన్నాయి. ఈవీ బస్సుల శాతం 25 అయితే, మద్యం మత్తులో డ్రైవింగ్‌కు వస్తున్న సిబ్బంది సంఖ్యలో ముందంజలో ఉంది. రెండున్నరేళ్లలో 627 కేసులు నమోదయ్యాయి. చిన్నా చితకా ప్రమాదాలు, ప్రయాణికులతో గొడవలు సరేసరి. ఇటీవల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఘటనలకు 9 మంది అధికారులను బాధ్యుల్ని చేస్తూ సస్పెండ్‌ కూడా చేశారు.

ప్రైవేటు సారథ్యం

బెంగళూరు ట్రాఫిక్‌ రద్దీ రెట్టింపయింది. ఆదమరిస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజా రవాణా వాహనాలు అయిన సిటీ బస్సుల్లో మాత్రం డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బెంగళూరులో బీఎంటీసీలో

డ్రైవర్ల లీలలు

ఈవీ బస్సుల్లో మరీ అధికం

ప్రజల ప్రాణాలతో చెలగాటం

తనిఖీలన్నీ తూతూమంత్రమే

ప్రమాదాలు, గొడవలతో తలనొప్పి

రెండున్నరేళ్లలో 627 కేసుల నమోదు

అన్ని బ్యాటరీ బస్సులను కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు కంపెనీలు నిర్వహిస్తున్నాయి. డ్రైవర్లను కూడా ఆ ప్రైవేటు కంపెనీలు నియామకం చేస్తాయి. లోపాలకు ఇది కూడా ఓ కారణం.

మందేసి.. స్టీరింగ్‌ ముందుకు..1
1/4

మందేసి.. స్టీరింగ్‌ ముందుకు..

మందేసి.. స్టీరింగ్‌ ముందుకు..2
2/4

మందేసి.. స్టీరింగ్‌ ముందుకు..

మందేసి.. స్టీరింగ్‌ ముందుకు..3
3/4

మందేసి.. స్టీరింగ్‌ ముందుకు..

మందేసి.. స్టీరింగ్‌ ముందుకు..4
4/4

మందేసి.. స్టీరింగ్‌ ముందుకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement