ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం

Nov 9 2025 7:19 AM | Updated on Nov 9 2025 7:19 AM

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం

హొసపేటె: ప్లాస్టిక్‌ రహిత విజయనగర జిల్లా నిర్మాణ నేపథ్యంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది నగరంలోని కూరగాయల మార్కెట్‌తో సహా వివిధ ప్రదేశాలపై దాడి చేసి 220 కేజీల ప్లాస్టిక్‌ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎర్రగుడి శివకుమార్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది కూరగాయల మార్కెట్‌తో సహా వివిధ దుకాణాలపై దాడి చేశారు. నగరంలోని కూరగాయల మార్కెట్‌లోని వ్యాపారులు ప్లాస్టిక్‌ కవర్లను ఉపయోగించి కూరగాయలు అమ్ముతున్నారని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ విరుపాక్షప్ప, మున్సిపల్‌ వర్కర్స్‌ సూపర్‌వైజర్‌ నాగేంద్ర వర్మ, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నుంచి కమ్యూనిటీ ఆర్గనైజర్ల బృందం సంయుక్తంగా ఈ దాడి నిర్వహించారు. మున్సిపల్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ విరుపాక్షప్ప మాట్లాడుతూ మొదటిసారి కనుక ప్లాస్టిక్‌ కవర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరోసారి ప్లాస్టిక్‌ కవర్లను ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని వ్యాపారులను హెచ్చరించారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని వీడి పేపర్‌ కవర్లు, క్లాత్‌ బ్యాగులు వంటి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించారు.

మున్సిపల్‌ అధికారుల దాడి

220 కేజీల కవర్లు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement