ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
హొసపేటె: రాత్రివేళ ఇళ్లు, కార్యాలయాల్లో చోరీలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి మొత్తం రూ.11.65 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు విజయనగర జిల్లా ఎస్పీ జాహ్నవి తెలిపారు. బుధవారం నగరంలోని తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జామున నాలుగు గంటల మధ్య హరపనహళ్లి పట్టణంలోని కాశీ సంగమేశ్వర లేఅవుట్‌లోని ఎమ్మెల్యే లతా మల్లికార్జున కార్యాలయం తలుపు తాళం, అల్మారా తాళాన్ని పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించారన్నారు. ఈ విషయపై ఎమ్మెల్యే హరపనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హరపనహళ్లి పోలీసులు చోరీ చేసిన వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు జరిపి దొంగలను గుర్తించి, వారి నుంచి దొంగిలించిన నగదు, బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఏఎస్పీ జి.మంజునాథ్, హరపనహళ్లి డీఎస్పీ వెంకటప్ప నాయక్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహంతేష్ జి.సజ్జన్ మార్గదర్శనంలో ఎస్‌ఐ శంభులింగ హిరేమట్ విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించడానికి పైబృందం గత నెల 10న మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో గాలించింది. నిర్దిష్ట సమాచారం ఆధారంగా దొంగతనం కేసుల్లో అంతర్రాష్ట్ర నిందితులు, మధ్యప్రదేశ్‌కు చెందిన జీల్య, రాకేష్ పవార్‌లను గుర్తించి పట్టుకున్నారు.
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్


