మైనింగ్‌ను శాసీ్త్రయంగా చేపట్టాలి
బళ్లారిటౌన్: జిల్లాలో మైనింగ్‌ను శాసీ్త్రయంగా చేపట్టి పర్యావరణాన్ని కాపాడటమే కాక రానున్న తరాలకు కూడా ఉపయోగపడేలా చూడాలని గని బాధిత పరిసర పునశ్చేతన పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సండూరు తాలూకాలో ఇటీవల మైనింగ్ తవ్వకాల ప్రభావం తీవ్రంగా శృతిమించిందన్నారు. వార్షికంగా 20 మిలియన్ టన్నులు మాత్రమే తవ్వాల్సి ఉండగా 50 మిలియన్ టన్నుల మైనింగ్ ఉత్పత్తులను తవ్వుతున్నారన్నారు. దీని వల్ల ఈ ప్రాంతంలో మైనింగ్, లారీల రాకపోకల ప్రభావం వ్యవసాయ భూములతో పాటు ఇతర పర్యావరణానికి ముప్పు వాటిల్లిందన్నారు. దీనిపై తాము మంగళవారం జిల్లాలోని సండూరు తాలూకా నరసాపురం గ్రామం కొండపై ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. పరిసరాలను రక్షించడం అడవులను కాపాడుకోవడం మన హక్కు అని కుమారస్వామి కొండ పక్కన గల కొండలను పిండి చేసి మైనింగ్ తవ్వుతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే మరో 40 ఏళ్లలో కొండలు కనిపించకుండా పోతాయని, దీనిపై అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి నియంత్రించాలన్నారు. సమావేశంలో సమితి నేతలు ఉగ్రనరసింహగౌడ, సీఎం శివకుమార్, మల్లికార్జున రెడ్డి, నాగలక్ష్మిద, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ నాయుడు, ప్రకాష్ రెడ్డి, విరుపనగౌడ తదితరులు పాల్గొన్నారు.


