శిష్యుల ఉన్నతి గర్వకారణం
హుబ్లీ: గురువుల కన్నా శిష్యులు ఎక్కువ ఉన్నతి సాధిస్తేనే గర్వకారణం అవుతుందని విశ్రాంత వైద్యుడు డాక్టర్ అనిల్ వైద్య తెలిపారు. గదగ్‌లోని పంచాచార్య విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంచి పని చేయడానికి సాధ్యం కాకపోతే ఫర్వాలేదు. చెడ్డ పనిని చేయరాదు. మనమందరం చక్కగా మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.
సాధకులకు సన్మానం
రాయచూరు రూరల్ : సమాజ సేవ చేయడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని బీజేపీ కార్యదర్శి రవీంద్ర జాలదార్ అభిప్రాయ పడ్డారు. ఆదివారం నగరంలోని జాలదార్ కార్యాలయంలో సమాజంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి కళా తపస్వి సంస్థ ఆధ్వర్యంలో ఎడదొరె సిరి అవార్డులను అందించి సన్మానించారు. సమాజానికి ఉన్నతమైన సేవలు అందించాలనే తపనతో భారతీయ సేనలో శివకుమార్, కవిత్వంలో ఈరణ్ణ, సమాజ సేవా రంగంలో విరుపమ్మలు అందించిన సేవలు మరువరానివన్నారు. కార్యక్రమంలో అశోక్ కుమార్, అశ్విని, శేఖర్, వెంకటేష్, సంతోష్ కుమార్‌లున్నారు.
మెరుగైన ఆరోగ్యంతోనే ఆర్థికాభివృద్ధి
హుబ్లీ: ప్రణాళికా బద్ధంగా ఆర్థిక నిర్వహణ, పొదుపు, ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చని, శారీరకంగా, మానసికంగా బాగుంటేనే ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుందని సమాచార నిపుణులు ప్రశాంత మొటగి తెలిపారు. గదగ్ తాలూకా హులకోటిలోని కేహెచ్ పాటిల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. షేర్ మార్కెట్‌లో ఆన్‌లైన్ మోసాల ప్రక్రియ గురించి, తదితర నేరాలు జరిగే విధానాలను వివరించి ఆర్థికంగా బాగుండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధ, డాక్టర్ జితేంద్ర, సంబంధిత విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
నగరసభ కమిషనర్
బదిలీకి డిమాండ్
రాయచూరు రూరల్: రాయచూరు నగరసభ కమిషనర్‌ను బదిలీ చేయాలని రాయచూరు నగర ఉస్మానియా కాయగూరల విక్రయదారుల క్షేమాభివృద్ధి సంఘం అధ్యక్షుడు మహావీర్ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరసభలో విధులు నిర్వహిస్తున్న కమిషనర్ ఏనాడూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించలేదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు రాలేదన్నారు. అక్రమంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను తొలగించాలన్నారు. బీజేపీ నేత రవీంద్ర జాలదార్ సీఏ, ప్రైవేట్ వ్యక్తుల స్థలంలో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ప్రభు నాయక్, తిమ్మారెడ్డి, బసవరాజ్, రిజ్వాన్, ఉదయ కుమార్, ఖాజప్పలున్నారు.
వీధి కుక్కలకు ఆపరేషన్లు
హుబ్లీ: గదగ్‌లో వీధి కుక్కల బెడద తీవ్రత గమనించిన ఆ నగరసభ పాలనాధికారి అనుమతి మేరకు రెండవ దశ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సతో పాటు యాంటిరేబిస్ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. జిల్లాలో వీధి కుక్కల సమస్య అంతా ఇంత కాదు. దీంతో ఆ నగరసభ అధికారులు రెండవ దశలో భాగంగా మొత్తం 615 వీధి కుక్కలకు రేబిస్, ఎంఆర్‌ఐ తదితర చికిత్సలు అందించారు. మొత్తం 1వ దశలో 485 కుక్కలకు రేబిస్, ఏఆర్‌వీ ప్రక్రియ చేపట్టారు. రెండవ దశలో 615 వీధి కుక్కలకు ఈ ప్రక్రియ చేశారు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలను పట్టుకొనే ప్రక్రియ జరుగుతోందని కౌన్సిలర్ చంద్రు కరి, కమిషనర్ రాజారాం, ఏఈ ఆనంద్ బది తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం పంపిణీ
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని కక్కుప్పి గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్‌తో మరణించిన విద్యార్థిని కే.హెచ్.భాగ్య కుటుంబానికి అమ్మనకెరె గ్రామంలోని బసవేశ్వర ఆలయ అభివృద్ధి సేవా కమిటీ సోమవారం రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేసింది. ఆలయ కమిటీ సభ్యులు కెంపేగౌడర బసవరాజ్, గురికార్ బసవరాజ్, సీజీ మమ్మునాథ్, కే.సత్యనారాయణ మూర్తి, కే.కొట్రేష్, జీ.బసవరాజ్, ఎస్.బసవరాజ్, ఏఎం.వీరయ్య, హెచ్‌ఎం కరిబసయ్య పాల్గొన్నారు.
శిష్యుల ఉన్నతి గర్వకారణం
శిష్యుల ఉన్నతి గర్వకారణం


