రాయచూరు రూరల్: పురాతన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నాటకాలు, జానపద పాటలు, కోలాటాలు వంటి సంప్రదాయక సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుండేవి. నాటి నుంచి పగటి పూట వేషధారణ ధరించి ప్రజలకు మనోరంజనం చేసే పగటి వేషధారణ కళాకారుల్లో ఈరణ్ణ రుద్రాక్షిని మేటిగా చెప్పవచ్చు. నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో మార్పులు వచ్చినా పురాతన కాలం నాటి కళలు నేటికీ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఆ కోవకు చెందిన ఈరణ్ణ రుద్రాక్షి తల్లి శరణమ్మ, భార్య హన్మంతితో దేవదుర్గ శాంతినగర్ కాలనీలో నివాసముంటూ పల్లెల్లో తిరుగుతూ బుర్రకథలు చెబుతూ సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పౌరాణిక, ధార్మిక రంగాల ద్వారా బుడగ జంగమ సమాజం తరఫున పగటి వేషాలు వేస్తున్నారు.
పలు వేదికలపై ప్రతిభ ప్రదర్శన
ఈరణ్ణ రుద్రాక్షి, తల్లి శరణమ్మ, భార్య హన్మంతి హంపీ, మైసూరు దసరా ఉత్సవాలు, విశ్వ కన్నడ సమ్మేళనం, జానపద ఉత్సవాలు, కన్నడ రాష్ట్రావతరణ ఉత్సవాల్లో పాల్గొని పలు రకాల వేషాలు ధరించి చూపరులను ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీలో పగటి వేషధారణ ప్రదర్శనలు నిర్వహించారు. భీమాంజనేయ యుద్ధం, మోహిని భస్మాసుర, జటాసుర వధ, కంసుడి వధ, సుందోపసుంద, రామాయణ, మహాభారత పౌరాణిక ప్రదర్శనలు చేశారు. సాంఘీక నాటకాల్లో సంగొళ్లి రాయణ్ణ, సింధూర లక్ష్మణ, భీమ, రావణ, దుర్యోధన, శ్రీరామ, ఆంజనేయ వంటి పాత్రలు ధరించి ప్రజల మన్ననలను పొందారు. దర్శకుడిగా, సంగీత కళాకారుడిగా విధులు నిర్వహించారు. కర్ణాటక జానపద అకాడమి అవార్డు, హంపీ ఉత్సవ్ అవార్డు, బెళవడి మల్లమ్మ అవార్డు, విశ్వ కన్నడ సమ్మేళన అవార్డు, సంగొళ్లి రాయణ్ణ అవార్డులు పొందారు. 2007లో పురసభ సభ్యుడిగా గెలుపొంది తమ వార్డులో పలు అభివృద్ధి పనులు చేశారు.
పగటి వేషధారణ కళా ప్రతిభ అమోఘం
పలు రకాల అవార్డులు వరించిన వైనం
కళామతల్లి ముద్దుబిడ్డ ఈరణ్ణ
కళామతల్లి ముద్దుబిడ్డ ఈరణ్ణ
కళామతల్లి ముద్దుబిడ్డ ఈరణ్ణ
కళామతల్లి ముద్దుబిడ్డ ఈరణ్ణ


