కార్యవర్గం ఎన్నికకు నామినేషన్లు
బళ్లారిటౌన్: జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 2025–28 సంవత్సరాల మధ్య అవధికి కార్యవర్గం(పదాధికారుల) ఎన్నికకు సోమవారం చివరి రోజున నామినేషన్ల పర్వం చురుగ్గా సాగింది. ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ నామినేషన్ల ప్రక్రియ తొలుత నెమ్మదిగా సాగి క్రమంగా ఊపందుకుంది. మొత్తం 24 స్థానాలకు 44 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా అధ్యక్ష స్థానానికి 4, మూడు ఉపాధ్యక్ష స్థానాలకు 5 దరఖాస్తులు, ప్రధాన కార్యదర్శి పదవికి మూడు దరఖాస్తులు, రాష్ట్ర కార్యవర్గ సమితి స్థానానికి మూడు, జిల్లా కార్యదర్శి మూడు స్థానాలకు 5 దరఖాస్తులు, కోశాధికారికి మూడు దరఖాస్తులు, ఇక 15 జిల్లా కార్యవర్గ సభ్యుల స్థానాలకు 21 మంది దరఖాస్తులు సమర్పించారు. కాగా మంగళవారం దరఖాస్తుల పరిశీలన, ఈ నెల 30 వరకు విత్‌డ్రాకు అవకాశం, తర్వాత నవంబర్ 9న ఎన్నికలు జరిపి అనంతరం అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరపనున్నట్లు ఎన్నికల అధికారి నాగరాజ్ తెలిపారు.


