కలబుర్గిలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు
రాయచూరు రూరల్ : కలబుర్గి జిల్లాలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను భక్తులు నెరవేర్చారు. ఆళంద తాలూకా గోళా(బి)లో కొండ మీద వెలసిన లక్ష్మీదేవికి పంచమి రోజున భక్తులు, గ్రామస్తులు కలిసి ప్రత్యేక పూజలు చేస్తారు. సాధారణంగా దేవతా విగ్రహాల ఎదుట పూజలు చేస్తారు. ఇక్కడ దేవి పడమటి వైపు ముఖం చేసి ఉన్నందున దేవి విగ్రహానికి వెనుక భాగంలో పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. తమ కోరికలు నెరవేరాలని భక్తులు ఆమె వెన్నెముక భాగంలో కర్పూరం సమర్పించి, కొత్త చెప్పుల జతను కడతారు.
అమ్మవారికి వెనుక భాగంలో పూజలు
కొత్త చెప్పుల జత కట్టడం ఆచారం
కలబుర్గిలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు


