పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
హొసపేటె: విజయనగర జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి సోమవారం టీబీ డ్యాం ఆఫీషియల్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పుస్తకాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులను చదువుపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న వేడి భోజనాన్ని సక్రమంగా అందించాలని పాఠశాల హెచ్‌ఎంను ఆదేశించారు. పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనపై శ్రద్ధ వహించాలన్నారు. నలి–కలి తరగతులను సందర్శించి పిల్లలతో చాలా ఆప్యాయంగా ముచ్చటించారు. అధికారి మనోహర్, పాఠశాల అధ్యక్షుడు, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మరణంలోనూ వీడని బంధం
● మృత్యువులోను ఒక్కటైన దంపతులు
● బీదర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
రాయచూరు రూరల్: ఏడడుగుల బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు మరణంలోనూ ఒక్కటై అందరినీ కలిచి వేసిన ఘటన బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. బీదర్ జిల్లా కమల నగర తాలూకా ముధోళ్(బి) గ్రామానికి చెందిన గుండప్ప హొడగి(85), భార్య లక్ష్మీబాయి హొడగి(83) అనే దంపతులు వయో సహజ అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. గురువారం రాత్రి భార్య మరణ వార్త విన్న భర్త రాత్రి 10 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఏడుగురు సంతానం, మునిమనవళ్లను చూసిన ఈ దంపతులకు అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.
కల్మలలో ఇళ్ల దొంగతనాలు
● ముగ్గురు నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్ : తాలూకాలోని కల్మలలో ఇళ్లలోకి దూరి చోరీ చేసిన ముగ్గురు నిందితులను గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం కల్మల రాకేష్, యశవంత్, శివకుమార్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సొమ్ము. ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సాబయ్య తెలిపారు. రెండు తులాల టక్కమణి హారం, 26 తులాల వెండి, రూ.86 వేల నగదును స్వాధీనం చేసుకొని కస్టడీకి తరలించినట్లు తెలిపారు.
మాజీ సీఎం సేవలు అనన్యం
రాయచూరు రూరల్ : రాష్ట్రానికి మాజీ సీఎం బంగారప్ప చేసిన సేవలు అనన్యమని ఆర్య ఈడిగ సమాజం అధ్యక్షుడు నరసనగౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని హెచ్‌ఆర్‌బీ కాలనీలోని ఆర్య ఈడిగ సమాజ భవనంలో ఏర్పాటు చేసిన బంగారప్ప 79వ జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. బంగారప్ప పేదల పెన్నిధి అని, రాయచూరు జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ఉండడానికి గణేకల్ వద్ద బంగారప్ప చెరువును నిర్మించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మంజునాథ్, ఈరప్ప గౌడ, తాయణ్ణ గౌడ, శివరాజ్, వీరేష్, రమేష్, రంగనగౌడ, బాబురావ్‌లున్నారు.
ఓటరు జాబితాలో
పేర్లు చేర్చుకోండి
రాయచూరు రూరల్ : కలబుర్గి డివిజన్ పరిధిలోని రాయచూరు జిల్లాలో ఈశాన్య ఉపాధ్యాయుల ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేయించాలని తహసీల్దార్ సురేష్ వర్మ సూచించారు. సోమవారం నగరంలోని రిమ్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేర్లను జాబితాలో చేర్పించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. నవంబర్ 6వ తేదీ చివరి రోజు కావడంతో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సమావేశంలో రిమ్స్ డీన్ రమేష్, పాలనాధికారి గురు లింగయ్య, జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్, టీపీ అధికారి చంద్రశేఖర్ పవార్‌లున్నారు.
పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
పాఠశాలలో ఆకస్మిక తనిఖీ


