రూ.49 కోట్ల లూటీలో ఇద్దరు అరెస్టు
బనశంకరి: బెంగళూరులో ఈ ఏడాది ఆగస్టులో విజ్డమ్ ఫైనాన్స్ సర్వీసెస్ అనే ఆర్థిక సేవల కంపెనీని విదేశాల నుంచి హ్యాకర్లు భారీగా కొల్లగొట్టడం తెలిసిందే. ఆ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలలోకి చొరబడి రూ. 49 కోట్ల ను స్వాహా చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పటి నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బెళగావిలో ఇస్మాయిల్ అత్తర్ (27), రాజస్థాన్‌లో సంజయ్‌పటేల్ (43) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హాంకాంగ్, దుబాయ్‌లో తలదాచుకున్న మరో 5 మంది బడా కేటుగాళ్ల కోసం గాలింపు సాగుతోంది.


