అడవుల్లో రిసార్టులు, గ్రామాల్లోకి మృగాలు
దాడులకు తెగబడుతున్న పెద్ద పులులు
మైసూరు: జిల్లాలో పులుల దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఇటీవల ఓ రైతు మీద పడి కళ్లు పీకి తీవ్ర గాయాలు చేసిన దుర్ఘటనను మరువకముందే.. బండీపుర పులుల అభయారణ్యంలో బెణ్నెగెరె గ్రామం వద్ద రాజశేఖర్ అనే మరో రైతును పులి పొట్టనపెట్టుకుంది. ఈ ఘోరానికి అటవీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని, వారిని సస్పెండ్ చేయాలని రైతు కుటుంబసభ్యులతో పాటు రైతులు, సంఘాల నాయకులు సోమవారం మైసూరులో ప్రభుత్వ ఆస్పత్రిలో ధర్నా చేశారు. రైతు మృతదేహం ఉన్న మార్చురీ ముందు నిరసనకు దిగారు.
అటవీ మంత్రికి ఫిర్యాదు
అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రె రాగా, మంత్రి ముందు అటవీ సిబ్బందిపై రైతులు మండిపడ్డారు. పులి తిరుగుతోందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దానిని పట్టుకుని ఉంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు. అడవిలో అక్రమంగా రిసార్టులకు అనుమతి ఇస్తున్నారని, దాంతో అడవి జంతువులు అడవులను విడిచి గ్రామాల్లోకి వస్తూ దాడులు చేస్తున్నాయని చెప్పారు. రైతు కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ఇస్తామని మంత్రి తెలిపారు.
అందువల్లే రైతులపై పులుల దాడులు
మైసూరులో రైతుల నిరసన
అడవుల్లో రిసార్టులు, గ్రామాల్లోకి మృగాలు


