
ట్రాక్టర్ బోల్తా
● 18 మందికి గాయాలు
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా ఆలూర్ క్రాస్ సమీపంలో జాతీయ రహదారి–50పై ట్రాక్టర్ అదపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని బోగలేరహట్టి నుంచి తాలూకాలోని హుడెం గ్రామంలో జరగనున్న నామకరణ కార్యక్రమానికి ట్రాక్టర్‌లో బయలుదేరారు. కూడ్లిగి తాలూకా ఆలూర్ క్రాస్ సమీపంలో జాతీయ రహదారి–50పైకి రాగానే ట్రాక్టర్ అదపుతప్పి బోల్తా పడింది. కనహోసహళ్లి పోలీస్‌స్టేషన్ పీఎస్‌ఐ సిద్రామ్ బిదరాణి, పోలీసులు, హైవే అసిస్టెంట్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని జగలూర్ తాలూకా ఆస్పత్రికి తరలించారు. తదుపరి చికిత్స కోసం దావణగెరె ఆస్పత్రిలో చేరారు. సంఘటన తర్వాత పారిపోయిన ట్రాక్టర్ డ్రైవర్ తిప్పేస్వామిని హోస్పేట్ సమీపంలో అరెస్టు చేశారు. కానహోసహళ్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
దీపావళికి సామగ్రి సిద్ధం
హుబ్లీ: నగరంలో దీపావళి కోసం పూజా సామగ్రి విక్రయాలు జోరందుకున్నాయి. ధార్వాడ జిల్లా, అలాగే జంట నగరాలైన హుబ్లీ, ధార్వాడ, గదగ, హావేరి, బళ్లారి, హోస్పేట, సుమారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ పూలు, ఇతర సామగ్రి విక్రయిస్తున్నారు. బెంగళూరుకు చెందిన వ్యాపారులు వందల సంఖ్యలో ప్లాస్టిక్ పూలను వివిధ రకాల డిజైన్లలో రూపొందించారు. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో స్థానికులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

ట్రాక్టర్ బోల్తా