
నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తాం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా నరసింహగిరిలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం చిరతాగుండా గ్రామంలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మా నాన్న గారి కలను నెరవేర్చబోతున్నానని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు శ్రమిస్తానని పేర్కొన్నారు. రేషన్ కార్డు, ఇళ్ల మంజూరు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చిరాతుగుండు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు రత్నమ్మ బసన్న, ఈఓ నరసప్ప, తహసీల్దార్ వీకే.నేత్రావతి, డాక్టర్ ఎస్‌పీ ప్రదీప్, బీఈఓ మిలేష్ బేవూర్, శాన్ తమన్న, సీపీఐ ప్రహ్లాద్ ఎస్.చన్నగిరి పీఐ జి.సుబ్రమణ్య, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకటేష్, మాజీ ఈఓ బసన్న, తళ్వార్ శరణప్ప, ఫుడ్ సర్వీస్ డైరెక్టర్ జే.ఆంజనేయ, గూడెకోటె గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఎన్.కృష్ణ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు మురళీ కృష్ణ, ఓబన్న, సావిత్రిమ్మ, కమలమ్మ, జయమ్మ, సూరమ్మ, గౌడు బొమ్మయ్య, కేపీ పాలయ్య, ఏకై గొండి నాగరాజ్, ఎస్టీ ఎంసీ అధ్యక్షురాలు మల్లమ్మ పాల్గొన్నారు.