
నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవాలు
బళ్లారి టౌన్: నవంబర్ 1న జిల్లా పాలన విభాగం ఆధ్వర్యంలో కర్ణాటక రాజ్యోత్సవాలను వైభవంగా జరుపుకోవాలని ఏడీసీ మహమ్మద్ ఝుబేర అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో జరిగిన ముందస్తు సమావేశంలో మాట్లాడారు. నవంబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకు రాజ్‌కుమార్ రోడ్డులోని మున్సిపల్ కళాశాల మైదానంలో పౌర పాలన మంత్రి రహిమ్‌ఖాన్ ధ్వజారోహణ చేస్తారన్నారు. ఇందుకోసం వేదికల సిద్ధత, పూర్తి పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై ఆయా అధికారులతో చర్చించారు. తొలుత కన్నడ మాత భువనేశ్వరి దేవి చిత్రపటానికి పూజలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ విభాగాల శద్ధ చిత్రాల వాహనాలను ఊరేగింపు చేపట్టాలని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని సన్మానించాలని పేర్కొన్నారు. నగరంలోని పరిశుభ్రత ప్రముఖ సర్కిల్‌లో దీపాలంకరణ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. సమావేశంలో కన్నడ సంస్కృతిక శాఖ ఏడీ బీ.నాగరాజు, వివిధ శాఖల అధికారులు చిదానందప్ప, షషుమొదీన్ పాల్గొన్నారు.