
ఆర్‌ఎస్‌ఎస్ కట్టడికి సర్కారు అడుగు
సాక్షి, బెంగళూరు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఊరేగింపులు, కార్యక్రమాలను కట్టడి చేసేలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రైవేటు సంస్థలు, సంఘాలు పబ్లిక్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించేందుకు ముందస్తుగా అనుమతి తీసుకునేందుకు మార్గదర్శకాలను విడుదల చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, దేవాలయాలు, వాటి మైదానాలు, పార్కులు, పురాతత్వ శాఖ స్థలాల్లో ఆర్‌ఎస్‌ఎస్ తదితర ప్రైవేటు సంస్థలు కార్యకలాపాలు సాగించకుండా నిషేధించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో గురువారం విధానసౌధలో కేబినెట్ భేటీ జరిగింది. వివరాలను న్యాయ శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు వివరించారు.
పబ్లిక్ ప్రాంతాల్లో పలు ప్రైవేటు సంస్థలు, సంఘాలు ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, కార్యకలాపాలను సాగిస్తున్నట్లు ఈ నెల 15న డీజీపీ లేఖ ద్వారా సర్కారుకు తెలిపారన్నారు. ఇలాంటి చర్యలు కచ్చితంగా చొరబాటు కిందికి వస్తాయని, ఈ కారణంతో ఇకపై ముందస్తు అనుమతి ఉండాలని కేబినెట్ భేటీలో చర్చించినట్లు మంత్రి తెలిపారు. అలాంటి కార్యక్రమాలకు నిర్ణీత పబ్లిక్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలను గుర్తించి కేటాయించాల్సి ఉందని, త్వరలో కొన్ని మార్గదర్శకాలు, ఆదేశాలను విడుదల చేస్తామన్నారు.
పంట నష్ట పరిహారం
● వర్షాల కారణంగా 12.82 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లడంతో ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరుకు ఆమోదం. నష్ట పరిహారం కింద ప్రతి హెక్టార్‌కు సబ్సిడీ రూ. 8500 కలిపి మొత్తం రూ. 25,500 ఇచ్చేందుకు తీర్మానం. బహుళ వార్షిక పంటలకు రూ. 22 వేల పరిహారం.
అంగన్‌వాడీలకు వస్త్రాలు
● మళవళ్లి వర్కింగ్ జర్నలిస్టు సంఘానికి స్థలం ఇచ్చేందుకు తీర్మానం.
● అంగన్‌వాడీ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ. సహాయకులకు చీరల పంపిణీకి ఆమోదం. ఇందుకోసం రూ. 13.98 కోట్ల మంజూరు
● అంగన్‌వాడీ కేంద్రాలకు ఔషధ కిట్ల కొనుగోలు కోసం రూ. 10 కోట్ల కేటాయింపులకు అనుమతి
కులగణనను పూర్తిచేశా: సీఎం
సాక్షి, బెంగళూరు: బెంగళూరుతో సహా రాష్ట్రంలో కులగణన జరుగుతుండడం తెలిసిందే. సీఎం సిద్దరామయ్య కావేరి నివాసానికి కులగణన సిబ్బంది రాగా, సీఎం వివరాలను అందజేశారు. 45 నిమిషాల పాటు కూర్చొని కోరిన సమాచారం అంతా అందించారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో సీఎం పోస్టు చేశారు. అసమానతలు, పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం ఈ సమీక్షను చేపట్టిందని, ప్రతి ఒక్కరూ ఈ సమీక్షలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో సంస్థల కార్యక్రమాలకు...
సర్కారు అనుమతి తప్పనిసరి
త్వరలోనే మార్గదర్శకాల జారీ
కేబినెట్ భేటీలో తీర్మానం
ఆర్‌ఎస్‌ఎస్‌తో జతకలిసే ఉద్యోగులపై వేటు: మంత్రి ఖర్గే
బనశంకరి: ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని ఐటీ బీటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, సీఎం సిద్దరామయ్య కు మరో లేఖరాశారు. వారు ఎలాంటి రాజకీయ పార్టీలు లేదా, సంఘ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనరాదు, ఎలాంటి సహాయం అందించరాదని నియమాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఇటీవల సంఘ్ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు , ఉద్యోగులు పాల్గొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటివారిపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేయాలన్నారు. సంఘ్‌తో పాటు ఎలాంటి సంస్థల్లో ఉద్యోగులు పాల్గొనరాదన్నారు. తన శాఖలో కొందరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారిపై నివేదిక అందించాలని కోరానని, నివేదిక అందిన వెంటనే వారిని సస్పెండ్ చేస్తానని తెలిపారు. బహిరంగ స్థలాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలను నిషేధించాలని ఖర్గే ఇదివరకే లేఖ రాయడం తెలిసిందే.
కేబినెట్ భేటీలో చేసిన ప్రధాన తీర్మానాలు..
విజయపురలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం
మైసూరులో నిమ్హాన్స్ తరహాలో ఆస్పత్రి నిర్మాణం
బెంగళూరు సంజయ్ గాంధీ ఆస్పత్రిలో రరూ. 26.9 కోట్ల ఖర్చుతో ఉపకరణాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్
వృషభావతి నది నీటి శుద్ధీకరణ పనులకు ఆమోదం
బెంగళూరు గ్రామీణ జిల్లా, చిక్కబళ్లాపు రం జిల్లాల చెరువులకు రూ. 650 కోట్లతో నీటి సరఫరాకు అనుమతి.

ఆర్‌ఎస్‌ఎస్ కట్టడికి సర్కారు అడుగు

ఆర్‌ఎస్‌ఎస్ కట్టడికి సర్కారు అడుగు