
1,180 తుపాకీ లైసెన్సుల రద్దు
బనశంకరి/ శివాజీనగర: సమాజంలో పౌరులు కూడా ఆత్మరక్షణకు తుపాకులను కలిగి ఉండవచ్చు. ఇందుకు ప్రభుత్వ అనుమతి ఉండాలి. సిలికాన్ సిటీలో ఏడాదిలో 1,180 గన్ లైసెన్స్‌లను నగర పోలీసులు రద్దు చేశారు. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు జరిపిన తనిఖీలలో మృతుల పేరిట ఉన్నవి, రెన్యువల్ చేయనివి, ఇతరత్రా లోపాలు బయటపడిన లైసెన్సులకు మంగళం పాడారు. లైసెన్స్‌ల్లో 946 మృతుల పేరులో ఉన్నట్లు వెలుగుచూసింది. 219 లైసెన్స్‌లను పునరుద్ధరించుకోలేదని గుర్తించారు. యజమానులు చనిపోతే, సంబంధీకులు వెంటనే తుపాకీని లైసెన్సుతో పాటు సమీప పోలీసుస్టేషన్‌లో అందజేయాలి. ఆ తరువాత కొత్తగా లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలనే నియమం ఉంది. లైసెన్స్ పొందినా తుపాకులను కొనుగోలు చేయనివారు 15 మంది ఉండగా వారి లైసెన్స్‌లను తొలగించారు. ప్రతి నెలా సుమారు 100 కొత్త దరఖాస్తులు వస్తున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు. బెంగళూరు పరిధిలో 8,500 కు పైగా తుపాకీ లైసెన్సులు ఉన్నాయి.
ఎక్కెడెక్కడ ఎన్ని రద్దు
● ఉత్తర విభాగం–193 ● దక్షిణ విభాగం–162 ● పశ్చిమ విభాగం–121 ● ఆగ్నేయ విభాగం–93 ● సెంట్రల్ విభాగ–88 ● ఈశాన్య విభాగం–87 ● వైట్‌ఫీల్డ్ విభాగం–69
బెంగళూరులో ఏడాది కాలంలో చర్యలు
ప్రతి నెలా 110 కొత్త దరఖాస్తులు
రాజధానిలో 8,567 మందికి అనుమతి
లైసెన్సు పొందడం ఎలా?
ప్రాణ బెదిరింపులు, తీవ్రమైన గొడవలు కలిగిఉండడం, ఆస్తుల రక్షణ కోసం తుపాకుల లైసెన్సును పొందవచ్చు. ప్రజలు నగర పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత పోలీసులు తనిఖీలు జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా లైసెన్స్‌కు ఆమోదం తెలుపుతారు. ఆ తరువాత లైసెన్సుదారు తుపాకీని కొనుగోలు చేసుకోవచ్చు. లైసెన్సుదారు నిబంధనల మేరకు ఏటేటా రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
2 నెలల్లో నిర్ణయం
ప్రతి దరఖాస్తును పరిష్కరిస్తాం, భారీ లావాదేవీలు జరిపే వ్యాపారులు కూడా లైసెన్స్ తీసుకోవచ్చు. ప్రాణహాని ఉన్నవారు, ప్రముఖులు క్రీడాకారులు, వ్యాపారులు పొందవచ్చు. దరఖాస్తు చేసిన 2 నెలల్లో లైసెన్స్ ఇవ్వాలా, వద్దా అనే నిర్ణయం తీసుకుంటాం. అనేకమంది దరఖాస్తులు పరిశీలనలోనే తిరస్కరణకు గురైనట్లు నగర జాయింట్ పోలీస్ కమిషనర్ (పరిపాలన) కులదీప కుమార్ జైన్ తెలిపారు.

1,180 తుపాకీ లైసెన్సుల రద్దు

1,180 తుపాకీ లైసెన్సుల రద్దు

1,180 తుపాకీ లైసెన్సుల రద్దు