
బెంగళూరు ఇలా ఉందేమిటి?
శివాజీనగర: సిలికాన్ రాజధాని బెంగళూరులో రోడ్లు ఏమాత్రం బాగా లేవు, ట్రాఫిక్ నరకం చూపిస్తోంది అని ఐటీ, బీటీ ప్రముఖులు సిద్దరామయ్య సర్కారును తూర్పారబడుతున్నారు. టెక్ ముఖ్యుడు మోహన్‌దాస్ పాయ్ ఆరోపణలు గుప్పించిన తరువాత, బీటీ దిగ్గజం కిరణ్ మజుందార్ షా అసంతృప్తిని వెళ్లగక్కారు. చైనా నుంచి వచ్చిన పారిశ్రామికవేత్త ఒకరు బెంగళూరు గురించి విస్మయం వ్యక్తంచేసినట్లు ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎందుకు బెంగళూరు నగరంలో రోడ్లు నాశనమయ్యాయి? ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు ఎందుకు ఉన్నాయి? ఇక్కడి ప్రభుత్వం పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వటం లేదా అని తనను ప్రశ్నించారని పోస్ట్‌లో రాసుకొన్నారు. ఈ పోస్ట్‌ను సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్, మంత్రి ప్రియాంక్ ఖర్గేకు ట్యాగ్ చేశారు.
మంత్రుల స్పందన
మంత్రి ఖర్గే స్పందిస్తూ, అందరూ కూడా వారి వారి పాత్ర వహిస్తేనే రాష్ట్రానికి మంచిదన్నారు. పరిశ్రమల మంత్రి ఎం.బీ.పాటిల్ స్పందిస్తూ వర్షాల వల్ల అన్నిచోట్లా సమస్య ఏర్పడింది, వర్షాలలో గుంతలరోడ్ల మరమ్మతులు సాధ్యం కాదు, అయినా పనులు చేస్తున్నామని తెలిపారు.
కిరణ్ మజుందార్ అసహనం