
అగ్నిప్రమాదంలో పాత రికార్డులు దగ్ధం
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకాలో విద్యా శాఖ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. మంగళవారం నగరంలోని పాత విద్యా శాఖ కార్యాలయంలో ఆకస్మికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో 50 ఏళ్ల క్రితం నుంచి ఉన్న పాత రికార్డులు దగ్ధమయ్యాయి. అగ్ని మాపక కేంద్రం అధికారులు వచ్చి మంటలను ఆర్పివేశారు. జిల్లా విద్యా శాఖాధికారి బడిగేర్ ఘటన స్థలానికొచ్చి పరిశీలించారు. తాలూకాలోని మర్చేడ్ హైస్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కొంత మంది దుర్మార్గులు కువెంపు మోడల్ హైస్కూలుకు నిప్పంటించడంతో పరికరాలు కాలి పోయాయి. గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టి టీవీ, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాబయ్య తెలిపారు.