
అలరించిన తుమకూరు దసరా
కళాకారిణుల సామూహిక నృత్యప్రదర్శన
తుమకూరు దసరా వేదికపై కళాకారుల యక్షగాన ప్రదర్శన
తుమకూరు: సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సాంస్కృతిక రాయబారిగా ఆయ్యే వ్యక్తి జీవితం సన్మార్గంలో సాగుతుందని జెడ్పీ సీఈఓ జీ.ప్రభు తెలిపారు. తుమకూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తుమకూరు దసరా వేడుకలు, ఉత్సవం సందర్భంగా నరసింహరాజు వేదికలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల కళాకారులు, విద్యార్థులు చేసిన నృత్యాలను చూసి వారికి బహుమతులు అందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి, కళాకారుడు ప్రతిఒక్కరూ కూడా సంస్కారవంతులు అవుతారని, కళలపై చిన్నారులు, యువత మక్కువను పెంచుకోవాలని అన్నారు. అనంతరం కళాకారులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
సాంస్కృతిక కార్యక్రమాలు అదుర్స్

అలరించిన తుమకూరు దసరా