
టీబీ డ్యాం గేట్ల మార్పు నిర్లక్ష్యంపై ధర్నా
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం గేట్ల మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ ఆరోిపించారు. గురువారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. గత ఏడాది 19వ క్రస్ట్‌గేట్ తెగిపోవడంతో నిపుణులు మిగిలిన 30 గేట్లు కూడా అధ్వాన స్థితికి చేరుకున్నాయని, మార్చాలని చెప్పినా సర్కార్ పెద్దలు వారి మాటలను పెడచెవిన పెట్టారన్నారు. ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గేట్ల అమరికకు చర్యలు చేపట్టడంలో బేజవాబ్దారిగా వ్యవహరించారన్నారు. డ్యాంలో 30 శాతం పూడిక పేరుకు పోయిందన్నారు. డ్యాం పరిధిలో సిబ్బంది కొరత ఉందన్నారు. ఈ విషంయలో ఆంధ్రప్రదేష్ సర్కార్‌తో చర్చించి సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత అధికంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.అతివృష్టి కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలన్నారు. జొన్నకు, వరికి రూ.3500, పత్తికి రూ.10 వేలు, మిరపకు రూ.15 వేలు మద్దతు ధరలు ప్రకటించాలన్నారు. నారాయణ పుర కుడి కాలువ మరమ్మతు పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.