
గోమాంసం రవాణా.. వ్యక్తి అరెస్టు
హుబ్లీ: గోమాంసం రవాణా చేస్తున్న వ్యక్తిని కసబాపేట పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై చిదానందయ్య సదరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిదానందయ్య, ఆయన స్నేహితులు బైక్‌లో వెళుతుండగా మాంసం రవాణా చేస్తున్న వాహనం వచ్చింది. దీంతో వారు దాన్ని పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాహనం ఢీకొని పాదచారి మృతి
మరో ఘటనలో వాహనం ఢీకొని పాదచారి మృతి చెందారు. ఆర్‌ఎన్ శెట్టి రోడ్డు వద్ద టాటా ఎంట్రో వాహనం పాదచారిని ఢీకొన్న ఫలితంగా మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రమాదంలో లక్ష్మీదేవి(74) మృతి చెందారు. మలుపులో వేగంగా వచ్చిన ఆ వాహనచోదకుడు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న లక్ష్మీదేవిని ఢీకొనడంతో తలకు బలమైన గాయమై తుదిశ్వాస వదిలింది. ఆ డ్రైవర్ వాహనంతో పాటు పరారైనట్లు దక్షిణ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
శ్మశాన స్థలం కేటాయించరూ
రాయచూరు రూరల్: నగరంలోని హరిజనవాడలో నివాసమున్న ప్రజలకు శ్మశాన స్థలాన్ని కేటాయించాలని మాల మహాసభ డిమాండ్ చేసింది. గురువారం విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ నివాసం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు భాస్కర్‌రాజ్ మాట్లాడారు. ఏళ్ల తరబడి శ్మశాన స్థలం లేక శవాలను పూడ్చడానికి ఇబ్బందిగా ఉందని, వెంటనే శ్మశాన స్థలం గుర్తించి మంజూరు చేయించాలని కోరుతూ ఎమ్మెల్సీకి వినతిపత్రం సమర్పించారు.