చేపల వేట.. పిల్లల ఆట | - | Sakshi
Sakshi News home page

చేపల వేట.. పిల్లల ఆట

Sep 19 2025 10:31 AM | Updated on Sep 19 2025 10:31 AM

చేపల

చేపల వేట.. పిల్లల ఆట

సాక్షి, బళ్లారి: వర్షాకాలం వచ్చిందంటే కాలువలు, చెరువులు, కుంటలు, పారే నీటిలో సహజ సిద్ధంగా చేపలు విస్తృతంగా కనిపిస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు పెద్దలతో పాటు పిల్లలు కూడా బృందాలుగా ఏర్పడి వెళ్తుంటారు. చేపలు తినే అలవాటు ఉన్నవారు వర్షాకాలంలో సహజ సిద్ధంగా వాతంటికవే పారే నీటిలో ఎదురుగా చేపలు పరుగెడుతున్న దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు విస్తృతంగా కురుస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో చేపలు పట్టడానికి పెద్ద సంఖ్యలో జనం పారే నీటి వైపు, చెరువుల వైపు పరుగులు తీస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చెరువులు, కుంటల్లో చిన్నారులు పడి ప్రమాదాలకు గురవుతున్న దృశ్యాలు కూడా ఎన్నో చూస్తుంటాం. అయితే ప్రమాదాలను కూడా లెక్క చేయక ధైర్యంతో చిన్నారులు గ్రామీణ ప్రాంతాల్లో చేపలను పట్టుకోడానికి పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

చేపలు పట్టేందుకు పిల్లలు మొగ్గు

బళ్లారి, విజయనగర జిల్లాల్లో చెరువులు, కుంటలు, పారే నీటిలో ఇటీవల చేపలు పట్టడానికి విద్యార్థులు పరుగులు తీస్తున్నారు. పాఠశాల సెలవు దినాల్లోనే కాకుండా కొందరు విద్యార్థులు స్కూల్‌కు కూడా ఎగ్గొట్టి ఇలాంటి పనులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చెరువులు, కుంటలు, పారే నీటిలో చేపలు పడ్డాయని తెలిసిన వెంటనే వాటిని పట్టుకొనేందుకు పరుగులు తీస్తున్నారు. చేపలకు గాలం వేయడంలో నైపుణ్యతను సంపాదిస్తున్నారు. ఉచితంగా చేపలు లభ్యమవుతుండటంతో వాటిని పట్టుకొని వండుకొని తింటున్నారు. ఇటీవల వర్షాలు కూడా బాగా కురువడంతో పెద్దలతో పాటు పిల్లలు కూడా చేపలు పట్టడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రారంభంలో చేపలు పట్టడానికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ రోజురోజు చేపలు పట్టడంలో నైపుణ్యతను సంపాదించి చాకచక్యంగా చేపలకు వల వేయడంతో పాటు కట్టె పుల్లల సహాయంతో నీటిలోని చేపలను తినడానికి ఆహారాన్ని వదిలి వాటిని పట్టుకొంటున్నారు.

చేపల పట్టడమంటే ఎంతో సరదా

విజయనగర జిల్లా కూడ్లిగి సమీపంలోని కొట్టూరు రోడ్డులో పక్కనే ఉన్న వంక పరివాహక ప్రాంతాల్లో చేపలు పడుతున్న చిన్నారులు మాట్లాడుతూ చేపలు పట్టడం అంటే తమకు ఎంతో సరదాగా, ఆనందంగా ఉందన్నారు. సెలవు రోజుల్లో చెరువులు, కుంటలు, పారే నీటిలో చేపలు పడుతామన్నారు. ఒక్కొక్క సారి కేజీ లేదా రెండు కేజీల చేపలు కూడా పడుతుంటామన్నారు. తల్లిదండ్రులు మందలిస్తుంటారని అయితే తాము ఆటలు ఆడేందుకు వెళుతున్నామని చెప్పి ఇలా చేపలు పట్టడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చేపలను పడుతూ వాటిని ఇంటికి తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు అందజేసి వండించుకొని తింటున్నామన్నారు. కాగా వర్షాకాలంలో చెరువులకు, కుంటలకు నీరు వచ్చినప్పుడు పలువురు చిన్నారులు ప్రమాదవశాత్తు పడి మృతి చెందుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు చిన్నారులపై దృష్టి పెట్టి చేపలు పట్టేందుకు వెళ్తున్న వారిని గమనించి ప్రమాదాల బారిన చిన్నారులు పడకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గాలం సాయంతో చేపలు పడుతున్న బాలలు

చీర సాయంతో చేపలు పడుతున్న పిల్లలు

నైపుణ్యంతో చేపలకు చిన్నారుల గాలం

వర్షం నీటిలో చేపలు విరివిగా

వస్తున్న వైనం

చెరువులు, కుంటలు, కాలువలు

చేపల ఆవాసాలు

భయం వీడి వర్షపు నీటిలో

చేపలు పడుతున్న పిల్లలు

చిన్నారులకు ప్రమాదాల నివారణపై జాగ్రత్తలు అవసరం

చేపల వేట.. పిల్లల ఆట1
1/2

చేపల వేట.. పిల్లల ఆట

చేపల వేట.. పిల్లల ఆట2
2/2

చేపల వేట.. పిల్లల ఆట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement