
రిమ్స్ వైద్యులపై చైర్‌పర్సన్ చిందులు
రాయచూరు రూరల్: రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌధరి రాయచూరు వైద్య విజ్ఞాన సంస్ధ కళాశాల, పరిశోధన కేంద్రం(రిమ్స్) వైద్యులపై చిందులు తొక్కారు. మంగళవారం నగరంలోని ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేసి వైద్యులను మందలించారు. తల్లీబిడ్డల ఆస్పత్రిని కూడా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు సరైన చికిత్స అందించడంతో పాటు శుభ్రతను పాటించక పోవడంపై అధికారులపై విరుచుకుపడ్డారు. వైద్యులు మందులు రాసిచ్చిన చీటీలకు మాత్రలు బయట తీసుకోవాలని సూచిస్తున్న అంశంపై కూడా నిలదీశారు. రోగులకు ఫ్యాన్లు లేకపోవడంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. సక్రమంగా వైద్య సేవలు అందించడం లేదంటూ రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో మరింత గట్టిగా హెచ్చరించారు. వైద్యులు రోగులను పరీక్షించకుండా చీటీలను రాసివ్వడంపై వైద్యాధికారి రమేష్‌ను ప్రశ్నించారు.

రిమ్స్ వైద్యులపై చైర్‌పర్సన్ చిందులు