
ధర్మస్థలలో తిరిగి తవ్వకాలు
బనశంకరి: ధర్మస్థలలో చాలారోజుల విరామం తరువాత మళ్లీ అస్థిపంజరాల కోసం వేట మొదలైంది. బంగ్ల గుడ్డ ప్రాంతంలో సిట్ అధికారులు, కూలీలు, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తవ్వకాలు జరుపుగుతున్నారు. గతంలో హత్యకు గురైన విద్యార్థిని సౌజన్య మామ విఠల్‌గౌడ బంగ్లగుడ్డలో రాశులుగా అస్థిపంజరాలను చూశానని సిట్ విచారణలో చెప్పడంతో మళ్లీ తవ్వకాలకు నాంది పలికారు. సుమారు 50 నుంచి 60 మంది బృందం బంగ్ల గుడ్డలోని దట్టమైన అరణ్య ప్రదేశంలో పరిశీలన చేశారు. కొన్నిచోట్ల ఎముకలు లభించాయని తెలిసింది.
పెద్దసంఖ్యలో బలగాలు
సిట్ ప్రత్యేక అధికారి జితేంద్రకుమార్ దయామ, ఎస్పీ సైమన్, 13 మంది అటవీ అధికారులు పాల్గొన్నారు. మెటల్ డిటెక్టర్‌ను కూడా వినియోగించారు. డాక్టర్లు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ పౌరకా ర్మికులు, తాలూకా ప్రజాప్రతినిధులు కూడా తవ్వకాల వద్ద ఉన్నారు. అధికారులు విఠల్‌గౌడను తీసుకెళ్లలేదు. కానీ అతడు కారులో ఆ ప్రాంతంలో తిరుగుతూ కనిపించాడు. తనకు సిట్ సమాచారం ఇవ్వలేదని, పిలవలేదని తెలిపాడు. అంతకు ముందు పురంధరగౌడ, తుకారాం అనే స్థానికులు సిట్ ముందు హాజరై, చిన్నయ్య శవాలను పూడ్చిపెట్టడం మేము చూశాము, తమకు సాక్షులుగా పరిగణించాలని కోరగా, తిరస్కరించారు. వీరిద్దరూ స్థలపరిశీలన సమయంలో వెళ్లారు కానీ దూరంగా నిలబడి కొద్దిసేపు గమనించి అక్కడనుంచి వెళ్లిపోయారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు సిట్‌కు సహకరించడం లేదని సమాచారం. క్లూస్ టీం సిబ్బంది ఎక్కువమంది ఉండడం, పీవీసీ పైపులను తీసుకెళ్లడాన్ని బట్టి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బంగ్ల గుడ్డలో హడావుడి
విఠల్‌గౌడ వాంగ్మూలమే కారణం