
మహిళలకు పౌష్టికాహారం తప్పనిసరి
హొసపేటె: పట్టణంలోని 6వ వార్డు ఆజాద్ నగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం తిమ్మలాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహార శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సీనియర్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ పీబీ.గిరిజా ప్రారంభించి మాట్లాడారు. గర్భిణి సీ్త్రలు పోషకాహారం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో జన్మించే బిడ్డ, తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. శరీరానికి పోషకాహారం తీసుకోవాలి. పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పటికప్పుడు టీకాలు వేయించుకోవాలి. సమస్యల నుంచి వారిని రక్షించవచ్చని వారు చెప్పారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.గీత, జూనియర్ ఇన్‌స్పెక్టర్ సునీత, శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు పార్వతి, ఆశా కార్యకర్త ఏఎం.సావిత్రి, ఉమా, జ్యోతి, పద్మ, అంగన్‌వాడీ కార్మికులు అంజలి, వైశాలి, తల్లులు పాల్గొన్నారు.