
బెస్కాం నిర్ణయం సరికాదు
బెస్కాం ప్రతిపాదనలను కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ సమాఖ్య – ఫిక్కీ (ఎఫ్‌కేసీసీఐ) తీవ్రంగా తప్పుపట్టింది. విద్యుత్ ధరల పెంపు వల్ల అంతిమంగా ఉత్పత్తుల కొనుగోలుదారులపై ప్రభావం పడనున్నట్లు తెలిపింది. ఆయా కర్మాగారాలు, పరిశ్రమల యజమానులు ఈ ఉత్పాదక ఖర్చును ప్రజలపై మోపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని ఆ భారాన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై మోపాలనుకోవడం సరికాదని ఫిక్కీ ఆరోపించింది. విద్యుత్ చార్జీల పెంపు ప్రభావం ఇతరత్రా రంగాలపై, ఉత్పత్తులపై కూడా కచ్చితంగా పడుతుందని స్పష్టంచేసింది.