
ఉడుపిలో కృష్ణాష్టమి వైభవం
రాధా కృష్ణుల వేషధారణలో బాలల నృత్య ప్రదర్శన
సోమవారం ఉడుపి ఆలయ వీధిలో ఉత్సవ సంభ్రమం
దొడ్డబళ్లాపురం: విఖ్యాత పుణ్యక్షేత్రమైన ఉడుపిలో కృష్ణాష్టమి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో కృష్ణ ఆలయంలో అష్టమి పూజలను ప్రారంభించారు.రోహిణి నక్షత్రం ముహూర్తంలో నల్లనయ్యకు ఆర్ఘ్య ప్రదానం చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తున్నారు. సోమవారంనాడు సాయంత్రం నుంచి కృష్ణలీలోత్సవం వైభవం మిన్నంటింది. ఆలయం ముందు తేరువీధిలో యువకులు ఉట్టి కొట్టే వేడుకను నిర్వహించారు. అంతటా పండుగ శోభ అలముకొంది. చిన్నారుల శ్రీకృష్ణ, రాధల వేషధారణలు అలరించాయి. కళాకారుల ప్రదర్శనలు అట్టహాసంగా సాగాయి.

ఉడుపిలో కృష్ణాష్టమి వైభవం